English   

రాహుల్ సిప్లిగంజ్ పబ్ కేసులో కొత్త ట్విస్ట్..

 Rahul Sipligunj
2020-05-08 16:07:59

టాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి ఇప్పుడు సంచలనంగా మారుతుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు తెలియని కొత్త కోణాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఆ రోజు రాత్రి తనపై పబ్‌లో ఎలా గొడవ జరిగిందో చూడండి అంటూ రాహుల్ సిప్లిగంజ్‌ తన ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేయడమే కాకుండా మంత్రి కేటీఆర్ ను కూడా న్యాయం చేయాలంటూ కోరాడు. తెలంగాణ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి ఈ గొడవలో ప్రధానంగా వినిపిస్తున్నాడు. ఆయనతో పాటు ఉన్న కొందరు వ్యక్తులు తనపై దాడి చేసారంటూ రాహుల్ చెప్తున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు కూడా ధర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఇక ఇప్పుడు ఇందులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. 

రాహుల్ మీడియా ముఖంగా ఆ ఎమ్యెల్యే కొడుకు మీద యాక్షన్ తీసుకోవాలని డైరెక్ట్ గా కేటీఆర్ కె ట్వీట్ వేసాడు. అయితే రాహుల్ కేసు.. కరోనా లాక్‌డౌన్ తో మూతపడింది. ఇక ఇప్పుడు మరోసారి రాహుల్ ఈ కేసు గురించి మాట్లాడాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది చెప్పడమే కాకుండా ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీడియాకు తెలిపాడు. ముఖ్యంగా ఈ కేసును వాపస్ తీసుకోవాలంటూ తనను కొందరు అడిగారని.. గొడవ జరిగిన తర్వాత దాడి చేసిన వాళ్లకు సంబంధించిన వాళ్లు తన ఇంటికి వచ్చి సారీ చెప్పినట్లు చెప్పుకొచ్చాడు రాహుల్. ఇప్పటి వరకు ఈ కేసులో ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యిందని.. క్లైమాక్స్ ఇంకా ఉందని తెలిపాడు. 

ఆ రోజు తనపై పబ్ లో బాటిల్‌తో దాడి చేసిన తర్వాత ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వినయ్ భాస్కర్ ద్వారా తన ఇంటికి వచ్చి కలిసి తనకు సారీ చెప్పారని.. కానీ తన మీద దాడి చేసిన రితేష్ మాత్రం తన దగ్గరకు రాలేదని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. ఆయన వస్తే కేసు క్లోజ్ అవుతుందని చెప్పాడు ఈయన. ఈ సంఘటన తర్వాత రితేష్‌కు మొహం చూపించడానికి సిగ్గేసినట్టు ఉంది.. అందుకే రాలేదేమో అన్నాడు. అయితే ఆ రోజు తనను ఒక్కడ్ని చేసి కొట్టడంపై కూడా తన అమ్మ వాళ్లపై సీరియస్ అయిందని.. అలా ఒక్కడ్నే చేసి కొట్టడానికి మీకు బుద్ది లేదా అంటూ తిట్టేసిందని చెప్పుకొచ్చాడు రాహుల్ సిప్లిగంజ్. వాళ్ళు వచ్చి కేసు విత్ డ్రా చేసుకోమని కోరారు.. కానీ రితేష్ వచ్చి మీడియా ముఖంగా సారి చెబితేనే కేసు వాపస్ తీసుకుంటామని చెప్పానని చెబుతున్నాడు రాహుల్. చూడాలిక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో..?  

More Related Stories