English   

పారితోషికం తగ్గించుకున్న స్టార్ డైరెక్టర్..

Director Hari
2020-05-08 16:46:58

కరోనా కాలంలో ఇంతకు ముందు ఇచ్చినట్లు కోట్లకు కోట్ల పారితోషికం ఇవ్వాలంటే ఇప్పుడు కుదరని పని. నిర్మాతలకు కూడా భారీగానే నష్టాలు వస్తున్నాయి.. వేల కోట్లు ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది. ఇలాంటి సమయంలో ముందు ఇచ్చినట్లు పారితోషికం ఇవ్వడం కుదరదని నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతో ఒక్కొక్కరుగా దీనిపై నిర్ణయం తీసుకుంటున్నారు. తమ పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ ఆంటోనీ తన పారితోషికాన్ని కోటి రూపాయలు తగ్గించుకున్నాడు. ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ హరి కూడా తన రెమ్యునరేషన్ లో 25 శాతం కోత విధించుకున్నాడు. కరోనా సమయంలో నిర్మాతల పాట్లు దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాడు ఈయన. 

అప్పులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు విడుదల జాప్యంతో ఏం చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇలాంటి సమయంలో పారితోషికాలు అంటే తలకు మించిన భారమే. అందుకే ఈ కరోనాతో ఇకపై సినిమా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పారితోషికాలపైనే ఈ ప్రభావం భారీగా పడబోతుంది. ఈ క్రమంలోనే సూర్యతో తను చేయబోయే తదుపరి సినిమాకు 25 శాతం పారితోషికం తగ్గించుకున్నట్లు హరి ఓ లేఖ ద్వారా వెల్లడించాడు. దాంతో నిర్మాతలకు కాస్త ఉపశమనం కలిగింది. ఈయన సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అంటే 2.5 కోట్ల వరకు మిగిలినట్లే. 

More Related Stories