English   

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్

ntr
2020-05-08 19:45:12

తెలుగు డైరెక్టర్ కాకపోయినా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన తీసిన మొదటి సినిమానే సూపర్ కాదు బంపర్ హిట్ కావడంతో మన తెలుగు హీరోల అభిమానులు మా వాడితో కూడా ఒక సినిమా చేస్తే బాగుండు అనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును ఆయనే ప్రశాంత్ నీల్. కన్నడ కేజీఎఫ్ ని తెరకెక్కించిన దర్శకుడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ కన్నడ సినిమా ప్రపంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ మొదటి భాగం హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ దర్శకుడు మహేష్ తో సినిమా చేస్తాడని మహేష్ అభిమానులు, ఎన్టీఆర్ తో చేస్తున్నాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మూవీ పూర్తి అయిన వెంటనే ఆయన కెజిఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతారని అంటున్నారు. 2021 చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ రెండేళ్ల పాటు బల్క్ డేట్స్ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.  

 

More Related Stories