English   

ఆకాశవాణికి ఏమయింది ?

akashavani
2020-05-08 20:28:58

రాజమౌళి కొడుకు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కీరవాణి తనయుడు కాల భైరవ ఈ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా, అశ్విన్‌ గంగరాజు అనే యువకుడుగా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. నిజానికి ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టి ఏడాది అవుతోంది. ఆ సినిమాకి ఆకాశవాణి అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు. జక్కన్న వద్దే శిష్యరికం చేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహించన ఈ సినిమాని వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఏమయింది ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల నుంచి కార్తికేయ తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తికేయ మొదటి నుంచి జక్కన్న చిత్రాలకు ప్రొడక్షన్, మార్కెటింగ్‌ విషయాల్లో తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇప్పటి దాకా ఆ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ ని అనుకున్న సయానికి పూర్తి చేసి.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇక ఊపిరి సలపకుండా శ్రమించాల్సి ఉందని అంటున్నారు. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం తన చిన్న సినిమాని ప్రస్తుతానిక్ పక్కన పెట్టినట్టు చెబుతున్నారు.  

 

More Related Stories