English   

అమెజాన్‌లో అత్యధికంగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..

amazon
2020-05-09 06:27:09

ఈ రోజుల్లో ఓటిటి ప్లాట్ ఫామ్‌లో సినిమాలు చాలానే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడంటే థియేటర్స్ మూతపడి ఎక్కువగా చూస్తున్నారేమో కానీ అంతకుముందు కూడా బాగానే చూసారు. నెల రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ వచ్చేస్తుంటే.. కొంతమంది అయితే ఏకంగా థియేటర్స్‌కు వెళ్లడం కూడా మానేసారు. ఓ అంచనా ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఓ సారి చూద్దాం..

కెజియఫ్ ఛాప్టర్ 1: అమెజాన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక వ్యూవర్ షిప్ తెచ్చుకున్న సినిమా కెజియఫ్ అని పేరుంది. ఇప్పటికీ తెలుగు సినిమాల లిస్టులో కెజియఫ్ టాప్‌లో ఉంది.
రాజావారు రాణిగారు: చిన్న సినిమానే అయినా కూడా అమెజాన్‌లో మాత్రం రాజావారు రాణిగారు పెద్ద హిట్ అయింది. అక్కడ మంచి వ్యూవర్ షిప్ అందుకుంది.
మహర్షి: మహేష్ బాబు సినిమాలకు అమెజాన్‌లో మంచి డిమాండ్ ఉంది. మహర్షి కూడా అక్కడ రప్ఫాడించింది.
ఎవరు: అడవి శేష్ నటించిన ఎవరు సినిమా కూడా అమెజాన్‌లో దుమ్ము దులిపేసింది. రెజీనా గ్లామర్‌తో పాటు విలనిజం సినిమాకు ప్లస్.
బ్రోచేవారెవురా: వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ కామెడి సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్‌లో అమేజింగ్ అనిపించింది.
సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సరిలేరు నీకెవ్వరు అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో రికార్డులు సృష్టించింది.
సాహో: థియేటర్‌లలో తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో సాహో ఫ్లాప్ అయినా కూడా అమెజాన్‌లో మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఇక్కడ రప్ఫాడిస్తుంది సాహో.
2.0: రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం చిన్నపిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే అమెజాన్ టాప్ లిస్టులో ఉంది.
రంగస్థలం: రామ్ చరణ్ అల్టిమేట్ బ్లాక్‌బస్టర్ రంగస్థలం ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్‌లోనే ఉంది.
మజిలీ: నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా కావడంతో ఆ క్రేజ్ అలాగే ఉంది.. ఇప్పటికీ మజిలీ మంచి వ్యూవర్ షిప్ తెచ్చుకుంటుంది.
వీటితో పాటు చిరంజీవి సైరా, మొన్న విడుదలైన పలాస, మధ లాంటి సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దుమ్ము దులిపేస్తున్నాయి.

 

More Related Stories