English   

సాయి పల్లవి బర్త్ డే స్పెషల్.. ఆమె గురించి మీకు తెలియని విషయాలు..

sai
2020-05-09 06:40:41

తెలుగు ఇండస్ట్రీ లో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఎవరైనా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని అంటారు ఈమె డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయింది కార్డియాలజీ చేసి హాయిగా పేషెంట్స్ తో ఉండాలనుకున్న తను ఊహించని విధంగా సినిమాల్లోకి వచ్చింది ఫిదా సినిమా కంటే పదేళ్ల ముందే ఢీ డాన్స్ షో లో సాయి పల్లవి కంటెస్టెంట్ గా చేసింది ఈమెకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్స్ అంటే ప్రాణం మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యరాయ్‌లను చూసి డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పింది సాయి పల్లవి. మే 9న ఈమె పుట్టిన రోజు. చిన్నప్పుడు చదువుకున్న కోయంబత్తూర్ అంటే తనకెంతో ఇష్టమని.. ఇప్పటికి కూడా షూటింగ్‌లు లేకపోతే అక్కడికే వెళ్లిపోతానని కూడా ఆమె ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఎందుకంటే ఆ వాతావరణానికి తానెంతగానో కనెక్ట్ అయ్యానని సాయి పల్లవి తెలిపింది. ఇక అభిమాన హీరో విషయానికి వస్తే కాలేజ్ డేస్ నుంచి తనకు సూర్య అంటే ప్రాణం అని చెప్పింది అలాంటి సూర్యతో ఎన్జీకే సినిమాలో నటించేటప్పుడు తను ఆకాశంలో ఉన్నట్టు చెప్పింది ఈమె.

ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా ఆయన్నే చూస్తూ కూర్చునేదాన్ని అంటుంది పల్లవి. సూర్యతో నటించడం తన అదృష్టం అంటుంది ఈమె. ఇక ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే దర్శకుడు రీషూట్ చేశారని సాయి పల్లవి చెప్పింది. దీంతో ఒకరోజు సినీరంగాన్ని వదిలేస్తానని అమ్మకు చెప్పి ఏడ్చేశానని.. కానీ దర్శకుడు ఏం చేసినా కూడా సినిమా కోసమే అని తెలిసి పాజిటివ్ గా తీసుకున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నట్లు చెప్పింది ఈమె. శేఖర్ కమ్ము ఫిదా సినిమా కోసం ట్రాక్టర్ నేర్చుకున్నానని చెప్పింది.. అలాగే మాగాణిలో ట్రాక్టర్ నడపడం చాలా కష్టమని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయాలను కూడా ఆమె మాట్లాడింది. ఫిదాలో వరుణ్ లాంటి అబ్బాయి కనిపిస్తే వెంటనే 'ఐ లవ్యూ చెప్పేస్తా' అని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది. తనను చాలా మంది మళయాలీ అమ్మాయి అని అనుకుంటారని.. కానీ కాదని.. తనది తమిళనాడులోని 'బడుగ' అనే గిరిజ తెగ అని ఏ మాత్రం దాచుకోకుండా చెప్పింది సాయి పల్లవి. తన మాతృభాష బడుగకు లిపి కూడా లేదని ఆమె చెప్పుకొచ్చింది. నిజంగా సాయిపల్లవికి సంబంధించిన ఈ వ్యక్తిగత విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది సాయి పల్లవి. దాంతో పాటు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న విరాటపర్వంలో కూడా ఈమె నటిస్తోంది. ఇందులో నక్సలైట్ పాత్రలో కనిపిస్తుంది సాయి పల్లవి.

More Related Stories