English   

సినిమా ఇండస్ట్రీకి గుడ్ న్యూస్.. త్వరలోనే థియేటర్లు రీ ఓపెన్..

halls
2020-05-09 08:12:23

లాక్ డౌన్ కారణంగా 45 రోజులుగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. మార్చి 25 నుంచి దేశంలో సినిమా హాల్స్ అన్నీ మూసేసారు. దాంతో వేలాది మందికి ఉపాధి లేకుండాపోయింది. ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారా అని వేచి చూస్తున్నారు వాళ్ళు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, సినిమా ఇండస్ట్రీ కూడా థియేటర్ల రీఓపెనింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. కానీ రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభించడంతో ఇప్పట్లో థియేటర్ ల గురించి మర్చిపోవాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే మే 18 నుంచి థియేటర్లు తెరుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇది అన్ని చోట్ల మాత్రం కాదు.

కేవలం గ్రీన్ జోన్లలో మాత్రమే థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. అది కూడా అప్పట్లో నాలుగు ఆటలు కాదు.. రాత్రి ఏడు గంటల లోపు 3 ఆటలు మాత్రమే ప్రదర్శించాలని నిబంధనలు పెడుతుంది. దానికి తోడు థియేటర్లలో కుర్చీల మధ్య గ్యాప్ ఉండాలని.. సానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించింది. దాంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ ఓనర్ లకు కేంద్రం కండిషన్స్ పెడుతోంది. చాలా రోజుల నుంచి థియేటర్లు మూతబడి ఉండటంతో ముందు ఏదో కొంత ఆదాయం రావాలని థియేటర్ ఓనర్ లు కూడా అన్ని నిబంధనలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గ్రీన్ జోన్ పరిధిలో ఉన్న థియేటర్స్ షాపింగ్ మాల్స్ మే 18 నుంచి ఓపెన్ అవుతాయి.

More Related Stories