English   

ఆంధ్రా వంటలు చేస్తోన్న కాజల్

 Kajal Aggarwal
2020-05-09 13:03:30

ప్రస్తుతం అందరూ కరోనా వలన ఏర్పడిన లాద్క్ డౌన్ లో ఉన్నారు. ఇక మామూలుగా క్షణం తీరిక లేకుండా ఉండే సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవుతుండడంతో రకరకాల పనులు చేస్తున్నారు. కొందరు జనానికి పనికొచ్చే పనులు చేస్తుంటే మరికొందరు రిఫ్రెష్ అవుతున్నారు. ఇక కాజల్ ఏమో లాక్ డౌన్‌ సమయంలో ఇంట్లోనే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌ తో షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో తాను సినిమా షూటింగ్స్‌ను ఎంతగానే మిస్ అవుతున్నానని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. అందుకే రాత్రి డిన్నర్‌లో తన పేరెంట్స్ కోసం ఆంధ్రా వంటల్ని చేసి పెట్టానని ట్వీటింది కాజల్. 

ఇది నా మొదటి ప్రయత్నం అంటూ  బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి చేసే  వాటితో పాటు పెసరట్టు కూడా వేసింది. తొలిసారిగా తాను ఈ వంటలు చేసినా... తన పేరెంట్స్ తనకు ఫుల్ మార్కులు వేశారని ఎగిరి గంతులు వేస్తోంది. అంతేకాక తాను చేసిన వంటల ఫోటోల్ని కూడా తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే కాజల్ పోస్టు చేసిన ఫోటోల్లో బెండకాయ ఫ్రై లాగా కనిపించడంతో అక్కడ పులుసు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కాజల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన మరో మూవీలో నటిస్తుంది.  

More Related Stories