English   

సావిత్రి శవాన్ని జెమిని ఇంటికి తీసుకెళ్లడం వెనక అసలు కథ ఇదే..

 Savitri Gemini Ganesan
2020-05-09 16:51:12

మహానటి అనే పదానికి అర్థం సావిత్రి.. ఎలా నటించాలి.. ఎలా అభినయించాలి.. ఎంత సన్నివేశానికి ఎన్ని హావభావాలు కావాలి అనే సావిత్రికి తెలిసినట్లు మరే నటికి తెలియదేమో..? ఆమె తరంలో చాలా మంది గొప్ప నటీమణులు ఉన్నారు కానీ సావిత్రిని మాత్రమే మహానటి అంటారు. దానికి కారణం కూడా లేకపోలేదు. సావిత్రి నటిస్తుంటే అలా చూస్తుండిపోతారంతా.. అంతగా కొలమానం వేసి సరిగ్గా సరిపోయేలా నటిస్తుంది సావిత్రి. అంత గొప్ప నటన ఆమెకు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ సావిత్రిని చూస్తుంటే మాత్రం అలాగే కళ్ళార్పకుండా ఉండిపోతారు వాళ్లు. జీవితంలో మోసం అంటే ఆమెకు తెలియదు.. సాయం చేయడం తప్ప. అలాంటిది ప్రేమ పేరుతో ఆమె మోసపోయింది.. సాయం చేసి మోసపోయింది.. పెళ్లి చేసుకుని మోసపోయింది.. తన అనుకున్న వాళ్లు కూడా ఆమెను చుట్టూ చేరి మోసం చేసారు. చివరి రోజుల్లో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి కూడా తల్లిని పట్టించుకోలేదంటే సావిత్రి జీవితం ఎలా ముగిసిందో అర్థం చేసుకోవచ్చు. 

బాగా బతికినపుడు అంతా ఆమె చుట్టూనే ఉన్నారు.. చివరి రోజుల్లో మాత్రం ఎవరూ లేకుండా పోయారు. దానికితోడు వారసత్వంగా వచ్చిన డయాబెటిస్, థైరాయిడ్ లాంటివి ఆమెను కోమాలోకి తీసుకెళ్లాయి. సావిత్రి బ‌తికి ఉన్న‌పుడు ఆమె జీవితంలో విల‌న్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా అన్ని వేళ్లు చూపించేది ఒక్క‌రి వైపే.. అత‌డే జెమినీ గ‌ణేష‌న్. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి చావును కూడా బ‌హుమ‌తిగా ప్ర‌సాదించాడు జెమినీ. అంటే ఆయ‌నే చంపేసాడు అని కాదు.. సావిత్రి త‌న జీవితంలో స‌ర్వం కోల్పోవ‌డానికి కార‌ణం మాత్రం జెమినీ అని ప్ర‌తీ ఒక్క‌రు ఒప్పుకోవాల్సిన నిజం. ఆయ‌న చేసిన కొన్ని పనుల వ‌ల్లే సావ‌త్రి జీవితం నాశ‌నం అయిపోయింది. స్టార్ హీరోయిన్ గా.. రాణిభోగం అనుభ‌వించిన సావిత్రి చివ‌రి రోజుల్లో క‌నీసం చేతిలో చిల్లిగ‌వ్వ లేకుండా చ‌చ్చిపోతే ద‌హ‌న సంస్కారాలు కూడా చేయించుకోలేనంత దారుణ‌మైన స్థితికి దిగ‌జారిపోయింది. దానికి కార‌ణం క‌చ్చితంగా ఆమె భ‌ర్త‌ జెమినీ గ‌ణేష‌నే. 

చివరికి 14 నెలలు కోమాలో ఉంటే జెమిని ఒక్కరోజు కూడా హాస్పిటల్ కు రాలేదంటారు విశ్లేషకులు. ఏదో ఖర్చులకు మాత్రం అప్పుడప్పుడూ డబ్బులు ఇచ్చేవాడని చెప్తారు. అది కూడా లోకం దృష్టిలో మంచివాడు అనిపించుకోడానిక.. కానీ అప్పటికే జెమిని విలన్ అయిపోయాడు. చివరికి ఆమె చనిపోతే ఇంటికి శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఆలోచించాడు జెమిని. అంతగా సావిత్రిపై ఆయన కోపం పెంచేసుకున్నాడు. లోకం ఎక్కడ ఆడిపోసుకుంటుందో అని అన్యాపదంగానే ఒప్పుకున్నాడు. అప్పటికే అందమైన రూపం కాస్తా చిక్కి శల్యమై ఎముకల గూడులా మిగిలిపోయింది. అది చూసిన అభిమానుల మనసు పగిలిపోయింది. సావిత్రిని కడసారి చూడ్డానికి వచ్చిన వాళ్లంతా కన్నీరు పెట్టుకోవడం.. జెమిని తిట్టడం ఒకేసారి జరిగాయి. అప్పటి నటి జి వరలక్ష్మి అయితే అందరి ముందు జెమినిని ఛీ నీ వల్ల కాదురా.. దానికి ఈ గతి పట్టిందంటూ తిట్టేసిన ఘటన అప్పటి వార్తా పత్రికల్లో వచ్చింది. ఇక నాగేశ్వరరావ్ ను అన్నా అని పలిచేది సావిత్రి.. ఆమె చనిపోతే మోయలేనంత మల్లెలు ఆమె కోసం తీసుకొచ్చాడు ఏఎన్నార్. సావిత్రిని అలా చూసి ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. చివరికి భర్త తలకొరివి పెట్టాల్సింది పోయి.. కొడుకు సతీష్ కర్మకాండలు జరిపాడు. అలా సావిత్రి జీవితం ముగిసిపోయింది. 

More Related Stories