English   

ఆకాశవాణి నుంచి రాజమౌళి తనయుడు కార్తికేయ ఔట్..

Karthikeya
2020-05-09 17:10:50

విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం ఆకాశవాణి. ఈ సినిమా గురించి అప్పట్లో చర్చ కూడా జరిగింది. రాజమౌళి తనయుడు నిర్మాతగా మారాడంటూ చెప్పుకున్నారు కూడా. అయితే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు కార్తికేయ అర్ధాంతరంగా తప్పుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. కొన్నిరోజులుగా ఇదే ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు పూర్తిగా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరో సినిమాకి తాను లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న నేపథ్యంలో రెండు సినిమాలకి సరైన సమయం కేటాయించలేకపోవడం వల్లే తప్పుకుంటున్నట్టు చెప్పాడు కార్తికేయ. 

ఆకాశవాణి మొదలైనప్పటి నుండి తనకి అండగా నిలిచిన దర్శకుడు, టీం మెంబర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపాడు ఈయన. కార్తికేయ తప్పుకోవడంతో ప్రాజెక్టుపై ప్రభావం కూడా భారీగానే పడేలా కనిపిస్తుంది. రాజమౌళి కుటుంబం నుంచి వస్తున్న సినిమా అంటే ఉండే అంచనాలు వేరు.. ఇప్పుడు కార్తికేయ తప్పుకోవడం ఆకాశవాణిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అని భయపడుతున్నాడు దర్శకుడు. ఆకాశవాణి చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. ఏ. పద్మనాభ రెడ్డి నిర్మాత. అయితే కార్తికేయతో కొన్నాళ్ళ ప్రయాణంకి సంబంధించి దర్శకుడు అశ్విన్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుండి ఇద్దరం విడిపోవలసి వచ్చింది. ఒకరిపై ఒకరికి తప్పక గౌరవం ఉంటుందని అశ్విన్ స్పష్టం చేసారు. 

More Related Stories