English   

లక్ష్మీ బాంబ్ నేరుగా ఓటిటిలో పేలబోతుందా...

Akshay Kumar Laxmmi Bomb
2020-05-09 17:34:19

స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో వస్తే బాగుంటుంది.. అక్కడే ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇఫ్పుడు మాత్రం థియేటర్స్ లాక్ డౌన్ కారణంగా మూత పడిపోవడంతో నేరుగా ఓటిటిలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విజయ్ మాస్టర్ సినిమాపై అలాంటి ప్రచారమే జరిగితే అలాంటిదేం లేదని.. విజయ్ మార్కెట్ కు డిజిటల్ సరిపోదని కొట్టి పారేసారు నిర్మాతలు. ఇప్పుడు అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా డిజిటల్ లో వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ లాక్ డౌన్ సమయాన్ని యూజ్ చేసుకుంటూ తమ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకున్నాయి ఓటీటీ సంస్థలు. దీనికి తోడు భారీ వ్యూయర్ షిప్ కూడా వస్తుంది. అందుకే నష్టాల నుంచి కాస్తైనా బయటపడ్డానికి తమ సినిమాలను నేరుగా అందులో విడుదల చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 

ఈ క్రమంలోనే అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ తెరకెక్కిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాంచన సినిమాకి రీమేక్‌గా లక్ష్మీబాంబ్ తెరకెక్కింది. ఈ చిత్రం ఎడిటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఇవి పూర్తికాగానే వెంటనే ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. దీనిపై దర్శక నిర్మాతలతో పాటు హీరో అక్షయ్ కుమార్ కూడా ఏం మాట్లాడటం లేదు. ఈ విషయమై హీరో అక్షయ్‌, నిర్మాత తుషార్‌ కపూర్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ ప్రతినిధి విజయ్‌ సింగ్‌తో చర్చలు జరిపారని.. 200 కోట్లకి డీల్ కుదరడంతో సినిమాని ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ చేసేందుకు సిద్దమయ్యారని టాక్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమాలు ప్రేక్షకుల ఇంటికి రానున్నాయి.

More Related Stories