English   

హ్యాపీ బర్త్ డే నమిత.. కోట్లాది మంది కలల రాణి..

namitha
2020-05-10 07:42:38

ద‌క్షిణాదిన గుడి క‌ట్టించుకునేంత అభిమానం ఉన్న తార‌లు చాలా త‌క్కువ. హీరోల‌కు గుడి క‌ట్ట‌డం వేరు కానీ హీరోయిన్ల‌కు కూడా గుడి క‌ట్టొచ్చ‌ని చూపించిన తొలి హీరోయిన్ ఖుష్బూ. ఈమెకు అక్క‌డ విప‌రీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ త‌ర్వాత న‌మిత అదే స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. త‌న బొద్దందాల‌తో ఇండ‌స్ట్రీని ఊపేసింది న‌మిత‌. మే 10న ఈమె పుట్టిన రోజు. 38 వసంతాలు పూర్తి చేసుకుని.. 39వ ఏట అడుగు పెడుతుంది నమిత. అప్పుడెప్పుడో 2002లో సొంతం చిత్రంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది న‌మిత‌. అప్పుడు ఆమె పేరు భైర‌వి. ఆ పేరుతోనే తెరంగేట్రం చేసింది నమిత. ఆ తర్వాత  త‌న పేరును న‌మిత‌గా  మార్చుకుంది. తెలుగులో ఒక రాజు ఒక రాణి.. జెమిని.. జగన్మోహిని.. బిల్లా.. సింహా లాంటి సినిమాలు చేసింది. ఇక త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల సినిమాల్లోనూ న‌టించింది ఈ భామ‌. తెలుగు ఇండస్ట్రీ అచ్చిరాలేదు కానీ తమిళనాట మాత్రం సంచలనాలు రేపింది నమిత. అక్కడ ఈమెకు ఏకంగా గుడి కూడా కట్టేసారు అభిమానులు. పదేళ్ల పాటు నమిత ఆడిందే ఆట పాడిందే పాట అక్కడ. అంతగా రచ్చ చేసింది ఈమె. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది నమిత. కాస్త తగ్గించింది.. మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే అంటుంది. పైగా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కమలం పార్టీ కండువా కప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.

 

More Related Stories