హ్యాపీ బర్త్ డే శ్రీముఖి.. బుల్లితెరపై మినీ సౌండ్ బాక్స్..

శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడేమో..? తన యాంకరింగ్ తో మతులు పోగొడుతున్న పటాస్ పిల్ల శ్రీముఖి ఇప్పుడు అందాలతో రెచ్చగొడుతుంది. టీవీల్లో రోజూ కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దతెరపై కూడా మాయ చేయాలని చూస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరులో హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుంది. ట్రెండ్ అవుతుంది కూడా. దానికి కారణం మే 10న ఈమె పుట్టిన రోజు. 2020, మే 10తో 27వ ఏట అడుగు పెడుతుంది శ్రీముఖి. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించినా కూడా ఈమెకు కోరుకున్న గుర్తింపు రాలేదు. అప్పుడెప్పుడో జులాయి సినిమాలో బన్నీ చెల్లిగా పరిచయమైంది శ్రీముఖి. బహుశా అదే ఈమె కెరీర్ కు శాపం అయిపోయింది. చెల్లిగా వచ్చింది కాబట్టి అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి ఈమెకు. దాంతో హీరోయిన్ కల నెరవేరలేదు. ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆరబోతకు తెరతీసింది. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్ గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. తాను యాంకరింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్రస్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది.
పైగా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. అప్పుడప్పుడూ షార్ట్స్ లో అందాల్ని ఆరబోస్తుంది శ్రీముఖి. ఆ మధ్య రెడ్ డ్రస్ లో అమ్మడు తొడలు కనిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామర్ షో చేసింది. ఇక మొన్నటికి మొన్న బిగ్ బాస్ ల చిట్టిపొట్టి నిక్కరులతో పిచ్చెక్కించింది. ఈ మధ్యే ఏకంగా బ్రా వేసుకుని హాట్ ఫోటోషూట్ చేసింది శ్రీముఖి. ఇది చూసిన తర్వాత కుర్రాళ్లు ఫిదా అయిపోకుండా ఉండలేరేమో..?