English   

జూనియర్ ఎన్టీఆర్‌కు కాజల్ అగర్వాల్ కొత్త పేరు..

kajal
2020-05-10 16:38:23

అచ్చమైన నందమూరి తారక రామారావు అనే పేరుండగా అంతకంటే మంచి పేరు ఇంకేముంటుంది అనుకుంటున్నారా..? కానీ ఉందంట.. ఇప్పుడు కాజల్ అగర్వాల్ పెట్టింది కూడా. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే మరో పది రోజులుండగా.. ఓ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. దీన్ని పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ లో జూనియర్ గురించి రాసుకొచ్చింది. తారక్ పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అడ్వాన్స్ గానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది కాజల్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. కానీ పది రోజుల ముందుగానే చెప్పుకొచ్చింది ఈమె. అక్కడితో ఆగకుండా తారక్ కు తాను కొత్త పేరు పెట్టానని చెప్పింది. ఆ పేరు తరామీ.. దానికి కూడా ఓ అర్థం చెప్పింది ఈమె. తరామీ అంటే తారక్ ప్లస్ సునామీ అని అర్థమంట. అలా తరామీ అయిపోయింది. ఈ పేరు అయితే తారక్ కు సరిగ్గా సరిపోతుందని చెప్పింది కాజల్. తను ఎన్టీఆర్ లో అంత సునామీ చూసానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేసారు. తొలిసారి బృందావనం సినిమాలో కలిసి నటించిన కాజల్, ఎన్టీఆర్.. ఆ తర్వాత బాద్షా, టెంపర్ లో రొమాన్స్ చేసారు. ఇక జనతా గ్యారేజ్ లో ప్రత్యేక గీతం చేసింది కాజల్. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతుంది.

More Related Stories