English   

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. హరీష్ శంకర్ ట్వీట్..

shankar
2020-05-10 09:52:35

గత 10 రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. హమ్మయ్యా ఇలాగే మరో పది రోజులు గడిస్తే పూర్తిగా ఫ్రీ అయిపోతాం.. హాయిగా అన్నీ గ్రీన్ జోన్స్ అయిపోతాయి అనుకున్నారు అంతా. కానీ అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరిగాయి. మే 9 ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వగా అందులో 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయినట్లు వెల్లడించింది ప్రభుత్వం. దాంతో అంతా మళ్లీ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

ఓ వలస కూలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా చెబుతూ.. మొత్తం 31 కేసులు నమోదయినట్లుగా రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే ఈ పాజిటివ్ కేసులు పెరగడంపై సంచలన దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. వైన్ షాపులు తెరిచిన తర్వాత కేసులు పెరగడంతో ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఇదే ట్వీట్ చేసాడు. మద్యం దుకాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరాడు. సీరియస్‌గా నడుస్తున్న లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం అనే విషయంపై ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలని ఆయన ట్వీట్ చేసాడు. అయితే మద్యం దుకాణాలు తెరిచి రెండు రోజులే అవుతుంది. కానీ కరోనా పాజిటివ్ నిర్థారణకు 14 రోజుల టైమ్ పడుతుంది.. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదంటున్నారు మరికొందరు. ఏదేమైనా కూడా మద్యం షాపుల విషయంలో మాత్రం మరోసారి ఆలోచించాల్సిందే అని చాలా మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదాయం కోసం చూసుకుంటే ఆరోగ్యం పోతుందని వార్నింగులు ఇస్తున్నారు.

 

More Related Stories