English   

దిల్ రాజు రెండో పెళ్లి నేడే...అధికారక ప్రకటన !

dil
2020-05-10 15:13:34

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ హోదా అనుభవిస్తున్న దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటాడని రకరకాల ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారం జరిగీ చాలా రోజులు గడుస్తున్నా దాని మీద ఎటువంటి అప్డేట్ లేక పోవడంతో ఇదంతా ప్రచారమే అనుకున్నారు. అయితే ఈరోజు తాను పెళ్లి చేసుకోబోతున్నానని కన్ఫాం చేశారు దిల్ రాజు. తన సొంత ఊరు నిజామాబాద్‌లో తనకు ఇష్టమైన వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో ఈరాత్రి పెళ్లి చేసుకోనున్నానని దిల్‌ రాజు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితుల్లో ప‌దిమందిలోపు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో దిల్‌ రాజు పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రెస్ నాట్ విడుదల చేశారు. "గ‌త కొన్నాళ్లుగా ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు వృత్తిప‌ర‌మైన ఇబ్బందులు అంద‌రికీ తెలిసిందే, తన వ్య‌క్తిగ‌త జీవితం కూడా అంత గొప్ప‌గా లేద‌న్న ఆయన  త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌న్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త మ‌లుపుతో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలంటున్న‌ట్లు దిల్‌రాజు ఆ నోట్ లో వెల్లడించారు. మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన అప్పటి నుండి ఒంటరిగానే జీవిస్తున్నారు.

 

More Related Stories