English   

క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉంటుంది...తప్పుపట్టలేం అంటున్న హీరోయిన్ !

adha
2020-05-10 15:22:30

సినిమా అంటేనే రంగుల ప్రపంచం, అలాంటి రంగుల ప్రపంచంలో కావలిసింది ట్యాలెంట్ ఒక్కటే కాదు అదృష్టం కూడా. ఒక వ్యక్తికి ఒక సినిమా అవకాశం వచ్చింది అంటే ట్యాలెంట్ ఒక్క దానివలనే అని చెప్పలేం. అనుకోకుండా కొందరు సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. అలా వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకోవడమే కాక హిట్ కొడతారు. ఆ తర్వాత వారి నుండి మరో సినిమా వస్తుందని కూడా చెప్పలేము. అయితే ట్యాలెంట్, అదృష్టం ఎంత ఉన్నా కావాల్సింది క్యారెక్టర్. ఎప్పటి నుండో క్యాస్టింగ్ కౌచ్ అనే విషయం మీద మనం రకరకాల కధలు వింటూనే ఉన్నాం. కొందరు ఈ విషయం మీద ఉద్యమాలే జరిగాయి. అయితే దీనిని వెనకేసుకొచ్చే నటీమణులు కూడా లేకపోలేదు. తాజాగా ఈ విషయం మీద హీరోయిన్ ఆదా శర్మ అలాంటి కామెంట్స్ చేసింది.

‘హార్ట్‌ఎటాక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన అదా శర్మ తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడుతూ..‘‘కాస్టింగ్‌ కౌచ్‌ అనే విషయం అనేది ఎక్కడైనా ఉంటుందని చెప్పుకొచ్చింది. దీనికి తెలుగు, తమిళం, బాలీవుడ్, హాలీవుడ్‌ అనే తేడా ఉండదని, మనం ఏం చెయ్యాలన్నది మనపైనే ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అందరినీ తప్పుబట్టడం సరికాదని ఆమె చెప్పుకొచ్చింది. మన నుండి ఎదుటివారు ఏదైనా ఆశించాడంటే వెంటనే మనం మేల్కొవాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశం అంతా లాక్‌డౌన్‌ లో ఉండడంతో అదా శర్మ ఇంట్లోనే ఉంటూ యోగాసానాలు వేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది.

More Related Stories