English   

కరోనా దేవుడి వర్షన్.. దారుణంగా పాటేసుకున్న వర్మ..

rgv
2020-05-10 15:34:42

ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంది. ఎప్పుడు ఎవరికి సోకుటుందో తెలియక గజగజ వణికిపోతున్నారు. జనం కూడా ఇంటి నుంచి కాలు బయటకు పెడితే మళ్ళీ మామూలుగా వస్తామా ఆ వైరస్ ని వెంట తీసుకొని వస్తాను అని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో రోజుకు ఎన్నో వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇంత సీరియస్ గా ఉన్న ఈ వైరస్ తో రాంగోపాల్ వర్మ ఇప్పుడు కామెడీ చేశాడు. ఆయన కరోనా వెర్షన్.. దేవుడి వెర్షన్ అలాగే మనిషి వెర్షన్‌లో ఉన్న ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు వర్మ. ఈ పాటను సిరాశ్రీ రచించగా.. డిఎస్ఆర్‌తో కలిసి వర్మే పాడాడు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది. వర్మ కరోనాతో ఆడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇదే చేసాడు. ఇది ఒక పురుగు అంటూ పాడాడు.

ఆ తర్వాత తనకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అంటూ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏప్రిల్ ఫూల్ అంటూ తనదైన శైలిలో కామెడీ చేశాడు. అయితే బయట సిచువేషన్ ఎంత దారుణంగా ఉన్నా కూడా.. ఎంత సీరియస్ ఉన్నా కూడా కేవలం దాన్ని లైట్ తీసుకుని మన లైఫ్ ఎంజాయ్ గా మార్చుకోవడానికి ఇలాంటి ట్వీట్ చేశాను అని చెప్పాడు వర్మ. అయితే ఎంత సమర్పించుకున్న కూడా ఇలాంటి సమయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు అసలు వేయకూడదని.. అందులోనూ ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ మీద కామెడీ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది అంటూ కొందరు నెటిజన్లు ఆయనకు హితవు పలుకుతున్నారు. పది మందికి చెప్పే పోజిషన్ లో ఉన్న మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. ఎవరేమనుకున్నా తాను చేసేది చేస్తాను అంటున్నాడు వర్మ.

More Related Stories