English   

అనుకోని ప్రమాదంలో పడిన విరాటపర్వం టీమ్ !

vp
2020-05-10 15:52:12

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని అలాగే నక్సలైట్ గా కనిపించనున్న సాయి పల్లవి కూడా తన పాత్ర కోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ టైం లో యూనిట్ కు అనుకోని ప్రమాదం ఎదురైందట‌. అదేంటంటే ఈ సినిమా షూట్ కోసం టీం అంతా వికారాబాద్ అడ‌వుల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో ఓ రోజు లొకేష‌న్ నుండి తిరిగి వస్తుండగా వారికి పెద్ద ఏనుగుల గుంపు ఎదురైంద‌ట‌. ఏనుగులు దాడి చేసే ప్ర‌మాదం ఎక్కువ ఉంద‌ని భావించిన యూనిట్ స‌భ్యుల‌కు ఏం చేయాలో అర్ధం కాలేదని అంటున్నారు. దాంతో వారు అంతా వెన‌క్కి తిరిగి పరిగెత్తార‌ట‌. చాలా సేపు త‌ర్వాత ఆ గుంపు వెళ్ళిపోయిందని తెలిశాక బయట పడ్డారని చెబుతున్నారు. సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్న ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వన్ నేనొక్కడినే, సాహో, ఉరిలాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని షాంచెజ్‌ లోఫెజ్‌ కెమెరామేన్‌గా పనిచేస్తున్నాడు.  

 

More Related Stories