English   

చిరంజీవి-రానాల మల్టీస్టారర్ ?

chiru
2020-05-10 15:59:11

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా మీద భారీ ఆంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బాగా లేటయిందని చెప్పచ్చు. అందుకేనేమో ఇది పూర్తి అవగానే చేయడానికి ఇప్పటి నుండే వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇప్పటికే ఆయన ముగ్గురు దర్శకులను తన నెక్స్ట్ మూవీ కొరకు లైన్ లో పెట్టారు. మెహర్ రమేష్, బాబీ అలాగే సుజీత్ తో కథా చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు కూడా. సుజీత్ కి ఆయన మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. ఆ స్క్రిప్ట్ పై ప్రస్తుతం సుజీత్ పని చేస్తున్నారు. దీనిని పూర్తి స్థాయి తెలుగు సినిమాగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట సుజీత్. 

ఇక డైరెక్ట‌ర్ బాబీ త‌న‌కు చెప్పిన కధ నచ్చిందని ఆ సినిమా చేస్తున్నామని చిరు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం మేర‌కు బాబీ డైరెక్ట్ చేయ‌బోయే సినిమా ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ అట. అయితే ఈ సినిమాలో  చిరంజీవితో రానా ద‌గ్గుబాటి న‌టించే అవకాశాలున్నాయ‌ని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల ఆగాల్సిందే. ఇది కాక చిరంజీవి డైరెక్టర్ శంకర్‌ తో ఓ సినిమా చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట. శంకర్‌ తో కలిసి పని చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారని, ఇటీవలే ఈ ఇద్దరి మధ్య కధా చర్చలు కూడా జరిగాయని టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది. చిరుకి శంకర్‌ ఓ సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ స్టోరీ చెప్పారట. దీంతో ఈ కధ బాగా నచ్చిన క్రమంలో వీరిద్దరూ ఒక సినిమా చేయచ్చని అంటున్నారు.  

 

More Related Stories