English   

మహేష్ బాబులో ఆ విషయం పట్టించుకోను.. నమ్రత కామెంట్స్..

namratha
2020-05-10 16:08:37

భార్యాభర్తలు అన్న తర్వాత అన్ని విషయాల్లోనూ కలిసే ఉండాలి. ఏదేమైనా కూడా అన్నీ పంచుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంటను చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. పాలునీళ్లలా తోడు నీడలా ఎప్పుడూ కలిసే ఉంటారు వాళ్లు. కానీ ఇప్పుడు నమ్రత మాత్రం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తను మహేష్ బాబు సినిమాల విషయంలో అస్సలు కలగజేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. నిజానికి మహేష్ ఓకే చేయాలనుకునే ప్రతీ స్క్రిప్ట్ కూడా ముందు నమ్రత విన్న తర్వాత కానీ సెట్స్ పైకి వెళ్లదని ఇండస్ట్రీలో వార్తలున్నాయి. కానీ నమ్రత మాత్రం తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని.. మహేష్ బాబు తన సినిమాల విషయంలో పూర్తిస్వేచ్ఛతో ఉంటాడని చెబుతుంది. మహేష్ ఏ సినిమాలు చేయాలో.. ఎలాంటి కథలు ట్రై చేయాలనుకుంటున్నాడో అన్నీ తన ఇష్టం అంటుంది నమ్రత శిరోద్కర్. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ సినిమాల విషయంలో తాను అస్సలు కలుగజేసుకోనని.. అందులో ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పింది. కనీసం మహేష్ బాబు చేయాలనుకుంటున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటో కూడా తనకు తెలియదని షాక్ ఇచ్చింది నమ్రత. తన సొంత నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాలను మాత్రం పట్టించుకుంటానని.. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా చేస్తున్నానని చెప్పింది నమ్రత శిరోద్కర్.

 

More Related Stories