English   

మహేష్ పరశురామ్ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్

mahesh
2020-05-10 16:44:39

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి పరశురామ్ తో సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కుదరలేదు. ఇక ఈ సినిమా కరోనా ఎద్దడి తగ్గాక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న లాంచనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంచించాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయిందని, ఒక కీలక రోల్ లో కన్నడ నటుడు ఉపేంద్రను ఎంపిక చేశారని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే వీటి మీద ఇంకా క్లారిటీ రాక ముందే మరో ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారని, అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని అంటున్నారు. అంటే చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారనేదే ఆ తాజా అప్డేట్. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. చూడాలి ఇందులో ఎంత నిజం ఉందొ ?

More Related Stories