English   

పూరి సినిమాలో నటించే ప్రయత్నం చేస్తానంటున్న వార్నర్

 Puri Jagannadh
2020-05-11 10:59:11

లాక్‌డౌన్ సమయాన్ని జాలీగా గడిపేస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. టిక్‌టాక్‌ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల బుట్టబొమ్మా పాటతో మెప్పించిన వార్నర్‌.. తాజాగా మరో దక్షిణాది సినిమాలోని పాటకు కుటుంబంతో కలిసి స్టెప్పులేశాడు. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన 'క్షత్రియ పుత్రుడు‌' సినిమాలోని 'సన్నాజాజీ పడాకా' అనే పాటకు తన సతీమణి, చిన్నారితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కాక నిన్న పోకిరిలోని డైలాగ్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇప్పుడు బ్యాటు పట్టుకుని డేవిడ్ చెప్పాడు.

వచ్చీరాని తెలుగులో లిప్ సింక్ ఇస్తూ ఈ క్రికెటర్ చెప్పిన విధానం దాదాపు అందరినీ కట్టి పడేస్తుంది. ఐపీఎల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు ఆడాల్సిన డేవిడ్ వార్నర్ కుటుంబంతో పాటు ఇక్కడే ఉన్నాడు. అందుకే తెలుగులో టిక్ టాక్ లు చేసి రచ్చ చేస్తున్నాడు. ఇక ఈయన డైలాగ్ వైరల్ కావడంతో పూరీ జగన్నాథ్ కూడా ట్వీట్ చేసాడు. నువ్వు మంచి యాక్టర్ కూడా.. నా సినిమాలో చేస్తావా అని అడిగాడు. దీనికి డేవిడ్ కూడా ప్రయత్నిస్తాను సర్ అంటూ రిప్లై ఇచ్చాడు. చూడాలి ఐపీఎల్ లో ఆడటానికి వచ్చిన ఈ ఆటగాడు పూరి సినిమాలో అతిధి పాత్రలో నటిస్తాడా అనేది.
 

More Related Stories