English   

దిల్ రాజు పెళ్లి...ఫొటోలు చూశారా

  Dil Raju
2020-05-11 12:04:28

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం నిన్న రాత్రి నిరాడంబరంగా జరిగింది. నిజామాబాద్‌లోని తన స్వగ్రామం నర్సింగ్ పల్లిలో తానే స్వయంగా కట్టించుకున్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. కరోనా నేపధ్యంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి విషయం నిన్న దిల్ రాజు ప్రకటించగా దానికి ఆయన కుమార్తె కూడా విష్ చేశారు.

అయితే తాజాగా ఈ పెళ్లి ఫొటోలు బయటకు వచ్చాయి. నిజామాబాద్ కు చెందిన తేజ అనే సినీ పరిశ్రమకు సంబంధం లేని యువతిని వివాహం చేసుకున్నారు. దిల్ రాజు మొదటి భార్య అనిత ఫిదా షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుండి దిల్ రాజు ఒంటరిగా ఉంటూ వస్తున్నారు.  దిల్ రాజు రెండో వివాహం చేసుకుంటారని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చినా అవి ఇన్నాళ్ళకి నిజమయ్యాయి. 

More Related Stories