English   

బోయపాటి బాలయ్య సినిమాలో ఒకప్పటి హీరో

 Balakrishna Boyapati
2020-05-11 13:06:35

డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలోనే సెట్స్‌ పైకి వెళ్ళాల్సి ఉంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తి అయింది. ఇంతలో కరోనా దెబ్బ పడింది. దీంతో అన్ని సినిమాల లానే ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని ఒక పాత్ర అఘోరా పాత్ర అని మరో పాత్ర నార్మల్ పాత్ర అని అంటున్నారు. ఇక ఈ అఘోరా పాత్రకు సంబందించి ఇప్పటి దాకా ప్రచారమే జరిగింది. అయితే దాని మీద బోయపాటి క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా ఒక ఛానెల్ని లైవ్ లో మాట్లాడిన ఆయన కొత్తదనం కోసం క్యారెక్టరైజేషన్ నుంచి కథ చెప్పాలని నిర్ణయించుకున్నానని ఈ కొత్త సినిమాలో బాలయ్య మరింత కొత్తగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.  అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ గాసిప్ బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ఒకప్మాపటి హీరో తొట్టెంపూడి వేణు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. బోయపాటి దమ్ము సినిమాలో వేణు ఎన్టీఆర్ కి బావగా నటించాడు. ఆ తరువాత ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఈయన బోయపాటి సినిమాలో కనిపించనున్నట్టు చెబుతున్నారు. 

More Related Stories