English   

ఏకంగా బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన అనసూయ

anasuya bharadwaj
2020-05-11 13:51:28

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన అన‌సూయ న‌టిగా కూడా రాణిస్తోంది. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ అందచందాల కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో నటించిన అనసూయ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. యాత్ర సినిమాలో చేసింది ఒకటి రెండు సీన్లలో అయినా తన నటనానుభవం చూపించింది అనసూయ. ఆ తర్వాత అన‌సూయ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు కూడా వార్తలు వినిపించాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నదని అన్నారు కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక ఆచార్య సినిమాలో లాక్ డౌన్ కు ముందు హీరోయిన్ రెజీనా పై ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇప్పుడు “ఆచార్య ” మూవీలో మరో స్పెషల్ సాంగ్ ఉందని ఆ రెండో సాంగ్ ని అనసూయ చేత చేయించనున్నారని కూడా ప్రచారం జరిగింది . ఆ విషయం మీద ఇంకా క్లారిటీ రాకున్నా ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌కి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టుప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఆఫర్ సినిమా కోసం కాదట, హిందీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళుతున్న ఒక సీరియ‌ల్‌లో ముఖ్య పాత్ర కోసం అన‌సూయ‌ని సంప్రదించారట మేకర్స్. అయితే మరి ఆ ఆఫర్ కి అనసూయ ఏమన్నదో ఇంకా తెలియదు. 
 

More Related Stories