English   

లాక్‌డౌన్ అవ్వగానే అక్కడికే వెళ్తానంటున్న శృతి హాసన్..

 Shruti Haasan
2020-05-11 14:31:58

కమల్ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీకి వచ్చింది కానీ ఇప్పటి వరకు తండ్రి పేరు మాత్రం ఎక్కడా వాడలేదు.. వాడను కూడా అంటుంది శృతి హాసన్. తనకంటూ సొంత గుర్తింపు కోసమే పోరాడుతున్నట్లు ఆమె ఎప్పుడూ చెప్తుంటుంది. ఇప్పటికీ అదే చేస్తుంది కూడా. తనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా తండ్రి ఇమేజ్ మాత్రం వాడుకోదు. మధ్యలో రెండేళ్లకు పైగా సినిమాలు లేకుండా ఖాళీగానే ఉంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇప్పుడు వరస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఏ పని లేకుండా ఉన్నానని.. లాక్ డౌన్ బోర్ కొడుతుందని చెబుతుంది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియాలో కాసేపు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఈ భామ. 

అందులో ఓ నెటిజన్‌.. మీ తండ్రి మీకిచ్చిన వరెస్ట్ పనిష్మెంట్ ఏంటని అడగ్గా.. మా నాన్న ఇంతవరకు నన్ను తిట్టలేదు. కొట్టలేదు. ఆయన అలాంటి వాళ్లు కాదని చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ లాజిక్‌గా ఉంటారని.. అయితే ఓ సారి తప్పు చేసినప్పుడు తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని మాత్రమే చెప్పారని రిప్లై ఇచ్చింది శృతి. లాక్‌డౌన్‌ తర్వాత ముందు మీరెక్కడికి వెళ్తారని అడగ్గా.. మరో ఆలోచన లేకుండా షూటింగ్స్ అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. తాను షూటింగ్‌లను చాలా మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక గబ్బర్‌ సింగ్ 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మాట్లాడిన శృతి.. ఆ సూపర్‌ హిట్ సినిమాలో తాను కూడా భాగం అవ్వడం అదృష్టం అని చెప్పింది.. ఆ సినిమా తనను చాలా మార్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రవితేజతో క్రాక్.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాల్లో నటిస్తుంది శృతి.

More Related Stories