English   

పాపం నాగార్జున.. కరోనా వచ్చి మొత్తం పాడు చేసిందిగా..

Nagarjuna
2020-05-11 14:49:52

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సోగ్గాడే చిన్నినాయ‌నా. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 50 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి నాగార్జున రేంజ్ ఏంటో చూపించింది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను నమ్ముకుని ఈ చిత్రం చేసాడు నాగార్జున. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. తెలుగులో సీక్వెల్స్ కలిసిరావని తెలిసినా కూడా ధైర్యం చేస్తున్నాడు. పైగా ఈ చిత్రం అనౌన్స్ చేసి కూడా చాలా ఏళ్లు అయిపోయింది. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల సోగ్గాడే చిన్నినాయ‌నా రేంజ్ నిల‌బడేలా ఓ సీక్వెల్ క‌థ సిద్ధం చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బంగార్రాజు టైటిల్ తో ఈ చిత్రం వ‌స్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం గురించి చాలాసార్లు చెప్పాడు నాగార్జున‌. అయితే స‌రైన క‌థ దొరికిన‌పుడు మాత్ర‌మే సీక్వెల్ చేస్తాన‌ని చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ స‌మ‌యం వ‌చ్చేసింది. 

క‌ళ్యాణ్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఈ సీక్వెల్ ముహూర్తం ఫిక్స్ చేసాడు నాగార్జున‌. ఉగాదికి లాంఛ్ చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సినిమా మరోసాయి వాయిదా పడింది. దాంతో బంగార్రాజు మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. ఇందులో మ‌రోసారి ర‌మ్య‌కృష్ణ‌తోనే జోడీ క‌ట్ట‌బోతున్నాడు నాగ్. ఆమెకు తోడు అనుష్క కూడా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇద్ద‌రూ త‌న‌కు క‌లిసొచ్చిన హీరోయిన్లే కాబ‌ట్టి నాగార్జున కూడా పండ‌గ చేసుకోవ‌డం ఖాయం. ఈ కాంబినేష‌న్ తెర‌పై చూడ్డానికి అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ క‌థ‌కు సత్యానంద్ లాంటి సీనియ‌ర్ రైట‌ర్లు కూడా స్క్రీన్ ప్లే సాయం చేసారు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈయన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. మొత్తానికి సోగ్గాడే ఎంత పెద్ద విజ‌యం సాధించిందో.. అంత‌కంటే పెద్ద విజ‌యం ఇప్పుడు బంగార్రాజు అవుతుంద‌ని చెబుతున్నాడు నాగ్. మొత్తానికి చూడాలిక.. బంగార్రాజు సినిమా మళ్లీ ఎప్పటికి మొదలు కానుందో..? 

More Related Stories