English   

బడ్జెట్ కంట్రోల్ గురించి క్లాస్ తీసుకుంటున్న రాజమౌళి..

Rajamouli
2020-05-11 16:52:19

తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. 50 కోట్లు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్న సమయంలో 300 కోట్లు పెట్టి బాహుబలి చేసాడు ఈయన. అంతేకాదు 2000 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా సత్తా చూపించాడు. ఆ సినిమా ఇచ్చిన స్పూర్థితోనే సైరా, సాహో లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ 21వ చిత్రం కూడా 150 కోట్లతో తెరకెక్కుతుంది. దాంతో పాటు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ కూడా 300 కోట్లతో వస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. కరోనా వైరస్ మహమ్మారి తో విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ కుంగిపొయింది. దాంతో సినీ పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉందిప్పుడు. ఈ లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల కోట్ల నష్టాలని చూస్తుంది. దాంతో ఇదివరకు మాదిరే ఇప్పుడు బడ్జెట్ అంటే కష్టమే. నిర్మాతలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. 

ఇలాంటి టైంలో మళ్లీ కోట్లకు కోట్ల బడ్జెట్ అంటే అయ్యేపని కాదు. అందుకే రాజమౌళి కూడా బడ్జెట్ కంట్రోలింగ్ సూత్రాలు చెప్తున్నాడు. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదని.. రాబోయే సినిమాల బడ్జెట్ విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకుంటే మంచిదని సూచించాడు జక్కన్న. అంతేకాకుండా రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కోత విధించుకోవాల్సిన సమయం వచ్చిందని నిర్మాతలు కూడా చెప్తున్నారు. రాజమౌళి కూడా ప్రొడక్షన్ కాస్ట్ కాకుండా రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటేనే మంచిదంటున్నాడు. సినిమా మేకింగ్ విషయంలో తగ్గడం కష్టమే అయినా కొన్నాళ్ల వరకు అలా చేయడం తప్పేమీ కాదని చెప్పాడు ఈయన. మరి ఇదే సూత్రాలు ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా ఉంటాయా లేదా అనేది చూడాలిక. 

More Related Stories