English   

ఇంద్రగంటితో విజయ్ దేవరకొండ.. కాంబినేషన్ కేక..

vijay
2020-05-11 19:33:14

వరస ఫ్లాపులు వస్తున్నా కూడా విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం దూసుకుపోతుంది. ఈయన క్రేజీ దర్శకులతో పని చేస్తున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ తర్వాత శివ నిర్వాణతో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రస్తుతం నానితోనే టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు శివ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయనున్నాడు శివ. ఇదిలా ఉంటే విజయ్ బర్త్ డే రోజు ఇంద్రగంటి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఏడాది నీ నుంచి ఇంకా మంచి సినిమా రావాల్సి ఉంది.. నువ్వు చేసే అద్భుతాల కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేసాడు ఇంద్రగంటి. దానికి రిప్లై ఇస్తూ విజయ్ కూడా మంచి ఆన్సర్ ఇచ్చాడు. మీరు అంటున్న ఆ అద్భుతం మనిద్దరం కలిసి చేయబోతున్నామని చెప్పాడు. అంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయిపోయినట్లే. ప్రస్తుతం ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ లేకపోయుంటే మార్చ్ 25నే విడుదలై ఉండేది. నాని ఇందులో విలన్ కాగా.. సుధీర్ బాబు హీరోగా నటించాడు.

More Related Stories