English   

పవన్ ఫాన్స్ అంటే అంతేమరి.. సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ కొత్త రికార్డ్..

pk
2020-05-11 20:15:00

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులు ఉంటారు.  ఎందుకో తెలియదు కానీ ఆయనపై ఒక్కసారి అభిమానం వస్తే  అది పరాకాష్టకు చేరిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఎప్పుడూ ఎనిమిదేళ్ల కిందట విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా  ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మే 11 2020కి ఈ సినిమా విడుదల 8 ఏళ్లు గడిచింది. దాంతో అభిమానులు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో గత 24 గంటల్లో ఏ సినిమా సాధించనన్ని రికార్డులు గబ్బర్ సింగ్ సాధించింది. ఈ మధ్యే మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమా వచ్చి 14 ఏళ్లు అయిన సందర్భంగా ట్రెండ్ లో ఆల్ మోస్ట్ 8.5 మిలియన్ వరకు ట్వీట్స్ వేయగా.. ఇప్పుడు ఆ రికార్డ్ ను భారీ మార్జిన్ తో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ క్రాస్ చేసింది. 24 గంటల్లో ఏకంగా 13.4 మిలియన్స్ వరకు ట్వీట్స్ ని పోల్ చేసి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును సృష్టించాడు పవన్ కళ్యాణ్.

మొత్తం మీద సినిమాల యానివర్సరీ ల ట్రెండ్స్ లో టాప్ 10 ప్లేసులలో ఉన్న ట్రెండ్స్ ని గమనిస్తే..

1) #8YrsOfGabbarSinghHysteria- 13.4Mil~
2) #14YearsForSouthIndiaIHPokiri-8.5M~
3) #DecadeForClassicDarling - 4Mil~
4) #2YEARSforBharatAneNenu-2.75M~
5) #3YrsForMightyBaahubali2-1.53M**
6) #DecadeForMemorableAarya2: 1.21M
7) #19YrsOfClassicIHKushi- 1.13M~
8) #9YrsOfCultClassicORANGE: 831K
9) #16YearsForMagicalAARYA: 870K
10) #8YrsForIHDookuduSensation: 676K

ఈ రికార్డులు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే ఇలాగే ఉంటారు మరి.. ఆయన సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానం మాత్రం తగ్గదు అని నిరూపించారు. దాంతో పాటు వకీల్ సాబ్ సినిమా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయింది. ఏదేమైనా ఎనిమిదేళ్ల కిందట వచ్చిన సినిమా ఇన్ని సంచలనాలు సృష్టిస్తే.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త సినిమా విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని అంచనాలు వేసుకుంటున్నారు విశ్లేషకులు.

More Related Stories