English   

విడుదలకు ముందే యూట్యూబ్ లో ఉప్పెన లాంటి రికార్డులు..

upena
2020-05-11 20:37:10

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. తాజాగా మరో హీరో కూడా వస్తున్నాడు. ఈయన పేరు వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ కు తమ్ముడు. ఈయన్ని హీరోగా పరిచయం చేయడానికి దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి వస్తున్నారు. ఉప్పెన సినిమాతో ఈ కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఒకవేళ అన్ని బాగుండుంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఈ నెల రోజులు అయ్యుండేది. ఇక తాజాగా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగులో అరంగేట్రం చేస్తుంది.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. లాక్ డౌన్ ముందు ఈ సినిమాలోని ఓ ఓ పాటను విడుదల చేశారు 'నీ కన్ను నీలి సముద్రం..' అంటూ సాగే ఆ పాటను జావేద్ అలీ ఆలపించగా.. శ్రీమణి అద్భుతమైన లిరిక్స్ అందించాడు ఇప్పుడు ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీనికి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తొలి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురంలో' పాటలు అన్నీ 100మిలియన్ల పైనే వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. ఇక ఇప్పుడు మెగా కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలోని 'నీ కన్ను నీలి సముద్రం' పాట 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. పాటతోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. మరి రేపు విడుదలైన తర్వాత ఉప్పెన ఎలాంటి ఉప్పెన క్రియేట్ చేస్తుందో చూడాలి.

More Related Stories