English   

తాప్సికి కాబోయే మొగుడు ఇతడే.. ఫారినర్ తో ప్రేమ..

tapsee
2020-05-12 06:49:34

మరో హీరోయిన్ కూడా ఫారిన్ అబ్బాయితో ప్రేమలో పడిపోయింది. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తాప్సీ.. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు విజయం సాధించినా నటిగా మాత్రం కోరుకున్న గుర్తింపు తెలుగులో రాలేదు. అందుకే బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది తాప్సీ పన్ను. అక్కడ కేవలం నటిగా గుర్తింపు తెచ్చిన పాత్రల్లో చాలా సినిమాలు చేసింది. మధ్యలో జుద్వా 2 లాంటి సినిమాల్లో బికినీలో రెచ్చిపోయినా..  ఎక్కువ భాగం పింక్, బేబీ లాంటి  ఆలోచనాత్మక సినిమాల్లో నటించింది. ఇక కొంత కాలంగా ఈమె ప్రేమలో ఉందనే విషయం తెలిసిందే.

ఆ మధ్య ఒక సారి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఆయన సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేని వాడని చెప్పింది. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ని కుటుంబ సభ్యులకి పరిచయం చేసి వాళ్ళు ఓకే చెప్పాక ప్రపంచానికి పరిచయం చేసింది. తాప్సీ ఇన్నాళ్ళు ప్రేమలో ఉంది బ్యాడ్మింటన్‌ ఆటగాడైన మాథియాస్ బో తో. ఈనాడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. తన ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించినందుకే అందరికి చెప్పింది తాప్సీ. లేదంటే ఇప్పటికీ మౌనంగా ఉండాల్సి వచ్చేది. ఇన్నాళ్లు ప్రేమని దాచడానికి కారణం నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమే అని తెలిపింది. అయినా తను ఎవరితో ప్రేమలో ఉన్నాను అనే విషయం కుటుంబానికి తెలుసు.. అది ప్రపంచానికి తనకు అవసరం వచ్చినప్పుడు చూపించొచ్చు అని  ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు తెలిపింది తాప్సీ. బో అనే వ్యక్తి తాప్సీకి ఆమె సోదరి షగున్ ద్వారా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మొదలైన వారి పరిచయం ప్రేమ వరకు వచ్చింది.

More Related Stories