English   

పవన్  హరీష్ శంకర్ సినిమాకి మళ్ళీ దేవీనే

 Harish Shankar
2020-05-12 12:20:09

గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు పవన్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసేశారు. పింక్ రీమేక్ లో లాయర్ గా, క్రిష్ సినిమాలో దొంగగా  నటిస్తున్న పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ ఎంత ఘాటుగా, నాటుగా ప్రెజెంట్ చేస్తాడా అని అప్పుడే చాలా అంచనాలు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో తేరి రీమేక్ కోసం పవన్ కి ఇచ్చిన అడ్వాన్స్ మైత్రి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది. 

హరీష్ పవన్ ఫ్యాన్ కావడంతో సినిమా రికార్డుల మోత మోగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరి కెరీర్ లో వచ్చి పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ విడుదలై నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా ఆనాటి మధురస్మ్రుతులను గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తకిరమైన అంశాన్ని ప్రకటించాడు. అదేంటంటే  పవన్ తో హరీష్ చేస్తున్న సినిమాకి మళ్ళీ దేవి శ్రీ నే మ్యూజిక్ అందిస్తున్నాడని ప్రకటించాడు. దీంతో హరీష్‌-పవన్‌-దేవిశ్రీ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం గబ్బర్ సింగ్‌కు మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  

More Related Stories