English   

సొంత నిర్మాణ సంస్థపై ఫోకస్ పెట్టిన సమంత చైతన్య

Naga Chaitanya Samantha
2020-05-12 12:39:30

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన తెలుగు స్టార్స్ మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు. నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నప్పుడే వీరు తమ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి దానిని రెండింతలు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ పద్దతిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. స్టార్ నటుల నుండి చిన్నా చితకా వారి దాకా అందరూ ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పటికే మ‌హేష్ బాబు, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ లాంటి చాలా మంది సొంత బ్యానర్స్ పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా నసుతున్నట్టు చెబుతున్నారు. ఆయన సొంతగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం మొదలయింది. 

చైతూ సమంతలు ఇద్దరూ కలిసి ఒక సొంత బ్యానర్ ఏర్పాటు చేసి మరీ ఒక సినిమా నిర్మిస్తున్నారని అందులో రాజ్ తరుణ్ ని హీరోగా అనుకున్నారని కూడా అంటున్నారు. ఈ మేరకు ఓ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేశారని త్వరలోనే అంటే లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్ కు వెళ్లబోతున్నట్లు చెప్తున్నారు. భారీ బడ్జెట్ కాకుండా మినిమం బడ్జెట్ లో తెరకెక్కించి సినిమాని హిట్ కొట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. గతంలో రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి చైతూ .. సమంతలకు కథను వినిపించగా ఆ కథ నచ్చే తమ బ్యానర్లో చేయడానికి చైతూ .. సమంత ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఎటూ ముందే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో స్టాఫ్ ఉండటంతో వాళ్లను ఈ ప్రొడక్షన్ కు కూడా ఉపయోగించబోతున్నారట.  

More Related Stories