English   

ప్రభాస్‌తో దిల్ రాజు..మరో పాన్ ఇండియన్ సినిమా 

Prabhas
2020-05-12 12:58:00

బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా సినిమా రిలీజ్ కావడంతో ప్రభాస్ ఇమేజ్ హాలివుడ్ స్థాయికి చేరింది. అయితే ఆ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సాహో సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ నిర్మాణ విలువలతో రూపొందించినప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం నిలవకేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో వింటేజ్ స్టైల్‌ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అశ్వినీ దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని అంటున్నారు. 

నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్‌ ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే టాక్ కొన్నాళ్ళ క్రితం వినిపించింది. దానిని దిల్ రాజు తెరకేక్కిన్చావచ్చని అన్నారు. నిజానికి దిల్ రాజు చాలా కాలం క్రితం ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ నిర్మించాడు. ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ప్రభాస్ క్రేజ్ వాడుకునేందుకు మళ్లీ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలనే నిర్ణయానికి 'దిల్' రాజు వచ్చాడట. అందులో భాగంగా ఒక మంచి కథను సిద్ధం చేసే బాధ్యతను దర్శకుడు వేణు శ్రీరామ్ కి చెప్పాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వేణు శ్రీరామ్ ఇప్పుడు పింక్ తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్' సినిమాకి కలిసి పనిచేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా అయ్యాక ఈ సినిమా తెరకెక్కించవచ్చని అంటున్నారు.  

More Related Stories