English   

యాంకర్‌తో ప్రేమలో పడిన హీరో.. సైలెంట్‌గా లవ్ స్టోరీ..

 Tollywood
2020-05-12 15:21:52

సినిమా ఇండస్ట్రీలో ప్రేమకథలు సర్వ సాధారణం. ఇక్కడ చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. అందులో కొందరు మనస్పర్థలతో విడిపోతుంటారు.. మరికొందరు మాత్రం అలాగే కలిసుంటారు. ఇప్పుడు మరో ప్రేమకథ కూడా నడుస్తుంది టాలీవుడ్ లో. ఇక్కడ ఓ యాంకర్, హీరో మధ్య చాలా రోజులుగా లవ్ స్టోరీ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. సమంత, చైతూ పెళ్లి తర్వాత టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయి ప్రేమకథ మరోటి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అంతా కెరీర్ పై ఫోకస్ చేయడంతో ఈ ప్రేమకథలు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు మరో లవ్ స్టోరీ మాత్రం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఓ యువ జంట ప్రేమలో ఉన్నారని.. కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆమె ఓ యాంకర్.. ఈయన ఓ హీరో.. ఈ ఇద్దరి మధ్య చాలా రోజులుగా ప్రేమ.. కానీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. 

ఇప్పుడు వాళ్ల ప్రేమ ముదిరి పాకాన పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. సదరు హీరో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు.. ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నాడు ఈయన. ఆ యాంకర్ ఎవరన్నది బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ మధ్యే ఆమెతో పాటు ఢిల్లీ కూడా వెళ్ళాడని తెలుస్తుంది. వాళ్ల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుసని.. రెండు కుటుంబాలు అంతా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. కొన్నేళ్ళ కింది వరకు కూడా వరస సినిమాలు చేసిన ఈ హీరో.. ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. హాయిగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ యాంకర్ మాత్రం ప్రస్తుతం బాగానే షోలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే మాత్రం మరో ట్రెండింగ్ లవ్ స్టోరీ కావడం ఖాయం. 

More Related Stories