English   

ఆడపిల్లకి జన్మనిచ్చిన స్వాతినాయుడు..

swathi naidu
2020-05-12 16:30:58

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది ఆమె. అడల్ట్ మూవీలతో పాటు పలు పోర్న్ చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి. పొట్టకూటికోసం, సినీ అవకాశాల కోసం అలా నటించాల్సి వస్తోందని ఆమె స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. అలాంటి ఈ యూట్యూబ్ సెలెబ్రిటీ గత ఏడాది పెళ్లి చేసుకుంది. సినిమాల్లో నటిగా రాణించాలనే కోరికతో ఇంటి నుండి హైదరాబాద్ కు చేరిన స్వాతి నాయుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమెకు టాలీవుడ్ లో ఛాన్స్ దొరకక బుల్లి తెర మీద ప్రయత్నాలు చేసింది. అక్కడా అవకాశం దక్కలేదు. 

నటిగా, యాంకర్ గా ప్రయత్నాలు చేసినా కూడా గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా సాఫ్ట్ పోర్న్ సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చింది. వందల కొద్ది బూతు చిత్రాలు చేసిన స్వాతి నాయుడు అవినాష్ అనే వ్యక్తిని పెళ్ళాడింది. అయితే ఆమె మే 10న అంటే నిన్న కాక మొన్న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. బిడ్డను స్వాతి హత్తుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు అభిమానుల నుంచి  శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఆమెకు నటి శ్రీరెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

More Related Stories