English   

హైపర్ ఆది గాడికి పెళ్ళైతే కరోనా చస్తదా.. శ్రీ రెడ్డి సంచలనం..

srireddy
2020-05-12 19:42:29

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదు. ఇఫ్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై నోరు పారేసుకుంది. తన విషయాల కంటే కూడా పక్కోళ్ల విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే ఈ నటి.. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మొదట్నుంచీ కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది శ్రీ రెడ్డి. అయినా దానికి కాని దానికి అందర్నీ ఆడిపోసుకుంటుంది అంటూ నెజటిన్లు కూడా ఫైర్ అవుతుంటారు. దానికితోడు ఇండస్ట్రీ కూడా ఈమెను అనధికారిక బ్యాన్ చేసింది. సినిమాలు కూడా రావడం లేదు. దాంతో పిచ్చెక్కిపోయి ఇష్టమొచ్చినట్లు చేస్తుందంటూ ఆన్ లైన్ లో జోకులు కూడా పేలుతున్నాయి. అప్పుడప్పుడూ మంచి విషయాలపై కామెంట్ చేస్తుంది శ్రీ రెడ్డి. కరోనా విజృంభిస్తున్న సమయంలో వలస కార్మికులు, ఉపాధి కోల్పోయిన దినసరి కూలీల దీనావస్థ గురించి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయింది. వారికి కనీస వసతులు కల్పించడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇంతమంచి విషయాలను చర్చిస్తూనే మరోవైపు గిల్లే కార్యక్రమం కూడా పెట్టుకుంది శ్రీ రెడ్డి. కొన్ని రోజలుగా హైపర్ ఆది పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీనిపై ఇప్పుడు శ్రీ రెడ్డి స్పందించింది. హైపర్ ఆది పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Related Stories