English   

మా ఆయన గే అనుకుని.. అక్షయ్ కుమార్ భార్య సంచలన వ్యాఖ్యలు..

akshay
2020-05-13 07:12:26

ఇది విన్న తర్వాత ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చెప్పిన విషయాలు అలా ఉన్నాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అక్షయ్‌తో పెళ్ళికి ముందు జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. అది విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. అప్పట్లో తనకు కాబోయే భర్త అక్షయ్ కుమార్ 'గే' అని తెలిసి షాకయ్యానని చెబుతూ అందరికీ షాకిచ్చింది. పైగా ఆ విషయాన్ని తన తల్లే స్వయంగా చెప్పిందని పేర్కొంటూ అప్పట్లో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా ఇప్పుడు జరిగిన కథ కాదు. దాదాపు 25 ఏళ్ళ కిందట జరిగిన స్టోరీ. అప్పటికే బాలీవుడ్లో అక్షయ్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు.

స్టార్ హీరో కాదు గాని మంచి హీరోగా ఫాంలోకి వచ్చాడు. అలాంటి సమయంలో అక్షయ్ కుమార్‌తో తన పెళ్లి ప్రస్తావన గురించి ఇంట్లో చర్చ వచ్చినప్పుడు ఆయన గే అనే మాట తన అమ్మ చెప్పినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయిందని చెబుతుంది ట్వింకిల్ ఖన్నా. అలా అమ్మ చెప్పినప్పుడు ఏమీ తోచలేదని.. ఆ మాట వినగానే తనకు మూర్ఛపోయినంత పనైందని ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. దీంతో ఆయనను పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయానని తెలిపింది. అయితే ఆ సమయంలో తల్లి డింపుల్ కపాడియా అతనితో ఓ ఏడాది డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకో అని చెప్పిందని.. ఆమె చెప్పినట్లుగానే సహజీవనం చేసి 2001లో అతన్ని పెళ్లాడానని ట్వింకిల్ ఖన్నా తెలిపింది. మొత్తానికి అక్షయ్ కుమార్ పై ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి.

More Related Stories