English   

రానా పెళ్లి గురించి షాకిచ్చిన సురేష్ బాబు..క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా తెలియదని 

 Suresh Babu
2020-05-13 11:43:15

మిహికా బజాజ్‌తో ప్రేమ విషయాన్ని రానా దగ్గుబాటి అనౌన్స్ చేయడం ఒక్కసారిగా అదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కనీసం ఆ రెండు ఫ్యామిలీలకి దగ్గరగా ఉండేవారికి కూడా తెలియకుండా లవ్ మ్యాటర్ గురించి సర్ప్రైజ్ ఇచ్చారు ఆ ఇద్దరూ. అయితే వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదని అంటున్నారు, బాహుబలి రోజుల నుండే వీరిద్దరి మధ్య పరిచయం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీరి ప్రేమ మాత్రం ఎవరికీ తెలియదట. తాజాగా ఈ విషయం మీద నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడటం సరైనది కాదన్న ఆయన ఇది తమకు ఓ వేడుక లాంటి సందర్భమని ఈ విషయం తెలిశాక మా కుటుంబమంతా చాలా హ్యాపీగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

అంతే కాక మిహిక, రానాకు చాలా రోజులుగా క్లోజ్ రిలేషన్ ఉందన్న ఆయన అయితే ఇలా  నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్నారు. అలాగే అందరూ అనుకుంటున్నట్టు డిసెంబర్ వరకు ఈ పెళ్లిని ఆపమని అంతకు ముందే చేసేస్తామని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వివాహం జరిపించేలా ఏర్పాట్లు చేసుకొంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే మిహికతో ప్రేమ విషయాన్ని రానా సోషల్ మీడియాలో వెల్లడించడం క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా షాక్ గురి చేసిందట. ఎందుకంటే వారిద్దరి స్నేహం గురించి తమకు తెలిసినప్పటికీ ఇలా ప్రేమ ఉంటుందని ఎవరూ ఊహించలేదట.   

More Related Stories