English   

లారెన్స్ రిక్వెస్ట్ తో ఏపీ ప్రజలకు సీఎం సాయం..థాంక్స్ చెప్పిన లారెన్స్

 Lawrence
2020-05-13 11:58:52

కొరియోగ్రాఫర్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో, దర్శకుడుగా సెటిల్ అయిన రాఘవ లారెన్స్ సాయం కోసం ఎదురు చూసే వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన జీవితంలో ఎంతో మందికి సాయ పడిన ఆయన కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం కూడా ఇచ్చారు. ఆయన ప్రకటించిన 3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు 50 లక్షల చప్పున అలాగే దివ్యాంగులకు 25 లక్షలు, తన స్వస్థలం రోయపురంలోని పేద ప్రజల కోసం 75 లక్షల సాయం చేశారు.

అయితే ఏపీ అలాగే చాలా రాష్ట్రాల నుండి ఎంతో మంది వలస కూలీలు ఉపాధి కోసం చెన్నై వెళ్తుంటారు. అలా వెళ్లిన కొంత మంది కూలీలు అక్కడ చిక్కుకుపోయారు. వాళ్లకు తిండి లేదు సరికాద ఉండటానికి ఆశ్రయం కూడా లేదు. అయితే ఈ విషయం లారెన్స్‌కు తెలిసి, వెంటనే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి పళని సామి దృష్టికి ఒక లేఖ ద్వారా తీసుకెళ్లారు. లారెన్స్ లేఖకు స్పందించిన సీఎం వారిని ఏపీకి పంపే ఏర్పాటు చేశారు. సీఎం తక్షణ స్పందన పట్ల లారెన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ ద్వారా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. చెన్నై నుంచి ఏపీకి బయలుదేరిని వలస కూలీల వీడియోను కూడా లారెన్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

More Related Stories