English   

ప్రముఖ నటి కుమారుడికి కరోనా.. ఆందోళనలో టాలీవుడ్..

Tollywood
2020-05-13 21:19:52

కరోనా వైరస్ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రపంచాన్నంతా వణికిస్తుంది.. ఇలాంటి సమయంలో ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో అని ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని ఉన్నారు జనమంతా. ఇక ఇప్పుడు మరో సంచలన వార్త కూడా బయటికి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటి కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 30, 40, 50, 80 కేసులు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ లో ఓ ప్రముఖ నటి కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అత్తారింటికి వెళ్లిన ఈయనకు అక్కడ తన భార్య వాళ్ల నాయనమ్మ, తాతయ్యల నుంచి వచ్చిందని తెలుస్తుంది. దిల్‌సుఖ్‌నగర్ పి అండ్ టీ కాలనీలో ఉండే వాళ్లకు కరోనా సోకింది. నాయనమ్మ ఇప్పటికే చనిపోగా.. తాతయ్యకు కూడా వచ్చింది. అదే రోజు అక్కడికి వెళ్లిన ఈ ప్రముఖ నటి కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఆందోళన పడుతున్నారు. ఆ నటి ఇండస్ట్రీలోనే 50 ఏళ్లుగా ఉంది. ఎన్నో వందల సినిమాలు చేసింది.. సహజ నటనతో అందర్నీ మాయ చేస్తుంది. ఆమె తనయుడికి కరోనా అనడంతో అంతా షాక్ అవుతున్నారు. 

More Related Stories