English   

మరోసారి సంక్రాంతి బరిలో రజినీకాంత్..

Rajinikanth
2020-05-13 16:15:33

రజినీకాంత్ కు ఈ మధ్య సంక్రాంతి సీజన్ బాగా అలవాటు అయిపోయింది. హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా కూడా ఆ పండక్కి రావడం మాత్రం అలవాటు చేసుకున్నాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. వచ్చే సంక్రాంతికి కూడా సూపర్ స్టార్ సంక్రాంతికి రాబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న అన్నాత్తై సినిమాను ముందు ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అది కుదిరేలా కనిపించడం లేదు. దసరా సీజన్ అనుకున్నా కూడా కరోనా కారణంగా అన్నీ నాశనం అయిపోయాయి. దాంతో అన్నాత్తై సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయబోతున్నారు చిత్రయూనిట్. సిరుత్తై శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా చాలా రోజుల తర్వాత రజినీకాంత్ పక్కా లోకల్ మాస్ సినిమా చేస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు రజినీ. 2021 సంక్రాంతికి తన సినిమా విడుదల చేయాలనుకుంటున్నాడు. బరిలోంచి రాజమౌళి ట్రిపుల్ ఆర్ తప్పుకున్న తర్వాతే ఈ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. దర్బార్, పేట లాంటి సినిమాలను సంక్రాంతికి తీసుకొచ్చాడు రజినీ. కానీ వర్కవుట్ కాలేదు.. ఇప్పుడు మరోసారి పండక్కే వస్తున్నాడు. మరి ఈ సారేం జరుగుతుందో చూడాలిక. 

More Related Stories