English   

సన్నీ లియోన్ బర్త్ డే స్పెషల్.. పోర్న్ నుంచి స్టార్ వరకు..

Sunny Leone
2020-05-13 16:47:46

మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో కెన‌డా నుంచి వ‌చ్చింది.. ఇక్క‌డ తిష్ట వేసింది.. కాదు కాదు.. కుర్రాళ్ల గుండెల్లో బెడ్ వేసుకుని మ‌రీ ప‌డుకుంది. ఆ భామే స‌న్నీ లియోన్. ఇప్పుడు ఇండియాలో ఈ పేరుకు ఓ చ‌రిత్ర ఉంది. పోర్న్ సైడ్ నుంచి వ‌చ్చినా ఈమెను శృంగార దేవ‌త‌గా అభిమానిస్తున్నారు. స‌న్నీ లియోన్ ఉంటే చాలు త‌మ సినిమాల‌కు కాసులు ఖాయం అనే న‌మ్మ‌కంతో ఉంటున్నారు నిర్మాత‌లు. పాపం.. స‌న్నీ కూడా వాళ్ల న‌మ్మ‌కాన్ని ఎప్పుడూ వమ్ము చేయ‌లేదు. తాను చేయాల్సిందంతా చేస్తూనే ఉంది. మే 13న ఈమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో కొన్ని తెలియని విషయాలు చర్చించుకుందాం. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ నుంచి ఈమె పాపులర్ అయింది. అందులో ఇష్టమొచ్చినట్లు అందాలు ఆరబోసి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి వచ్చి రచ్చ చేసింది. జిస్మ్ 2లో న్యూడ్ సీన్స్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత హద్దే లేకుండా పోయింది. 

సన్నీ ఇమేజ్ ను తెలుగులో కూడా వాడేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కరెంట్ తీగ సినిమాలో కేవలం 15 నిమిషాల పాత్ర కోసం 75 లక్షలు ఇచ్చారు మోహన్ బాబు కుటుంబం. ఇంత ఫేమ‌స్ ప‌ర్సినాలిటీ జీవితం గురించి తెలుసుకోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి.. ఈ ఎగ్జైట్ మెంట్ ను క్యాష్ చేసుకోడానికే రెండేళ్ల కింద స‌న్నీ లియోన్ జీవితాన్ని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్టారు. ఆమె అసలు పేరు క‌ర‌ణ్ జీత్ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. భారీ బ‌డ్జెట్ తోనే ఈ వెబ్ సిరీస్ చేసారు.. అది జీ 5లో ఇది ప్ర‌సారమై బాగానే పాపులర్ అయింది కూడా. ఈమె జీవితంలోని అతి ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోవాల‌న్నా.. కెన‌డా నుంచి ఇండియాకు ఎందుకు వ‌చ్చానో తెలుసుకోవాల‌నుకున్నా కూడా క‌ర‌ణ్ జీత్ వెబ్ సిరీస్ చూస్తే సరిపోతుంది. దీనికోసం ఈ భామ‌కు భారీ పారితోషికం ఇచ్చారు. మొత్తానికి రెండు చేతులా కాదు.. రెండు కాళ్లా కూడా సంపాదించ‌డమంటే ఇదే మ‌రి.

More Related Stories