English   

నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి

 Nikhil Siddhartha
2020-05-14 09:48:47

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్‌ మ్యారేజ్‌ ఎట్టకేలకు జరిగిపోయింది. నిజానికి ఈయనకు కొద్ది రోజుల క్రితమే తను ప్రేమించిన డాక్టర్‌ పల్లవి వర్మ అనే అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. తొలుత నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏప్రిల్‌ 16న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగాల్సి ఉంది. అయితే, అనుకోకుండా వచ్చిన కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లి వేడుకను వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ తర్వాత వధూవరులకు సరిపోయే ముహూర్తాలు లేకపోవడంతో హుటాహుటిన పెళ్లి పీటలు ఎక్కేశారు. ఈ ఉదయం 6గంటల 31 నిమిషాలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది.

ప్రభుత్వ నిభందనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ లో చాలా తక్కువమంది బంధువుల మధ్య నిఖిల్‌ వివాహం జరిగింది. ఇక పెళ్ళికి సంబందించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో నిఖిల్ తాళి కడుతున్నట్టు ఉంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశంలో లాక్‌ డౌన్‌ ఒకవేళ ఎత్తివేసినా మాస్ గ్యాదరింగ్స్ అనేవి ఇప్పట్లో కుదిరేవి కాదు. అంతే కాక ఇప్పుడు మూఢం కూడా వచ్చేస్తే శుభ ముహూర్తాలు అయిపోతున్నాయని భావించి నిఖిల్ లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడని అంటున్నారు. పల్లవి వర్మ కుటుంబం కూడా ఓకే చెప్పడంతో ఈరోజు పొద్దున్న పెళ్లి తంతు కానిచ్చేశారు. అంతా బాగున్నాక ఇండస్ట్రీలో పెద్దలందరినీ పిలిచి రిసెప్షన్ లాంటిది ప్లాన్ చేయాలని చూస్తున్నాడు నిఖిల్. 

More Related Stories