నిఖిల్ పల్లవి పెళ్లి ఫోటోలు

Nikhil Pallavi Wedding Photos.. హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేట్ లోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్ లో నిఖిల్-పల్లవి పెళ్లి సింపుల్ గా జరిగింది. లాక్ డౌన్ నిబంధనల మేరకు అతికొద్ది మాత్రం ఈ వివాహానికి హాజరయ్యారు.ఇక పెళ్ళికి సంబందించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిజానికి తన పెళ్లిని ఏప్రిల్ 16న ఎంతో గ్రాండ్ గా, ఆర్భాటంగా చేసుకోవాలనుకున్నాడు నిఖిల్. కానీ లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదు. అప్పటికీ ఓసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.
కానీ లాక్ డౌన్ పొడిగిస్తూ వస్తుండడం.. మరోవైపు మంచి ముహూర్తాలు కూడా అయిపోతుండడంతో.. తప్పనిసరి పరిస్థితుల మధ్య లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్నాడు.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితుల బట్టి టాలీవుడ్ కు గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు నిఖిల్. హనీమూన్ ప్లాన్స్ ను పూర్తిగా రద్దు చేసుకున్నారు.