English   

పుష్పలో సేతుపతి స్థానంలో బాబీ సింహా

Bobby Simha
2020-05-14 11:07:13

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పుష్ప అనే పేరు అలాగే సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నీ మొన్న బన్నీ పుట్టిన రోజున రిలీజ్ కూడా చేశారు. ఇక ఈ పోస్టర్స్ ప్రేక్షకుల‌లో ఒక రకమైన అంచ‌నా పెంచేశాయి. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారు. విలన్స్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతున్నా ఒక విషయం అయితే క్లియర్ అదే ఈ సినిమాలో ఒక కీలక పోలీసాఫీసర్ పాత్ర కోసం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే ఆయన ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందులో వివాదాలు లాంటివి అయితే ఏవీ లేవని కేవలం డేట్లు సర్దుబాటు కాకనే ఆయన తప్పుకున్నాడని అంటున్నా ఆ విషయంలో మరో కోణం తెరమీదకు వచ్చింది. 

అదేనటంటే దానికి కారణం ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడమేనట. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నప్పుడు పాన్ ఇండియా ఆలోచన లేదు. అందువల్ల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా సరే విజయ్ ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో  తెరకెక్కుతుండడంతో తమిళంలో అల్లు అర్జున్ మొదటి సినిమా అవుతుంది కాబట్టి, ఒక డెబ్యూ హీరో సినిమాలో ఇప్పటికే న్నో తమిళ సినిమాల్లో హీరోగా కనిపించిన తను విలన్ గా చేయడం వల్ల అక్కడి తన కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమో నని ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఆయ‌న స్థానంలో  అరవింద స్వామి, బాబీ సింహా పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్టు మొన్ననే ప్రచారం జరిగింది. 

తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం సుకుమార్ బాబీ సింహాతో చర్చలు జరిపారట. ఇక కథ విన్న బాబీ సింహాకు పాత్ర నచ్చిందని అయితే కాల్షీట్స్ సమస్య దృష్ట్యా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఒప్పుకున్నాడని ఈ విషయం మీద త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రావచ్చని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేదా థామస్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  

More Related Stories