English   

అన్నిటికీ బాక్సింగ్ నే వాడేస్తోన్న మెగా హీరో 

 Varun Tej
2020-05-14 11:42:05

మెగా ఫ్యామిలీ హీరోలకు ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ నుంచే వచ్చిన వరుణ్ తేజ్ మాత్రం మాస్ స్టోరీస్‌కి దూరంగా కొత్త కొత్త కథాంశాలు ఎంచుకుంటున్నాడు. మొదటి నుంచే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తోన్న వరుణ్, ఇప్పుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్‌ నేపధ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నవీన్ చంద్రను ఎంపిక చేసినట్టు కూడా తాజాగా ప్రచారం జరిగింది. ఆ విషయం మీద క్లారిటీ రాకున్నా కరోనా మాత్రం వరుణ్ ని ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న క్రమంలో బాడీని అలానే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.  ఈ లాక్ డౌన్ దెబ్బకు అందరూ ఇంట్లో ఉండి రిలాక్స్ అవుతుంటే వరుణ్ తేజ్ కి మాత్రం అలా రిలాక్సింగ్ కి కూడా అవకాశం లేదని అంటున్నారు. 

అయితే ఇదేమీ తనను ఇబ్బంది పెట్టడం లేదని అంటున్నాడు వరుణ్. ప్రస్తుతం తన ఇంటిలోనే బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నానాన్న వరుణ్‌ తేజ్‌ దానికి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశారు. ''కొన్నిసార్లు నాకు నేను బలహీనంగా అనిపిస్తానని అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా బాక్సింగ్‌ సాధన చేస్తానని చెబుతున్నాడు వరుణ్‌ తేజ్‌. నిజానికి అనుకున్నట్టు జరిగితే జూన్ కల్లా సినిమా పూర్తయ్యేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అసలు ఈ  లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడం వల్ల ఈ క్వారంటైన్ టైం లో కూడా రోజూ 5 గంటల ట్రైనింగ్, ఓన్లీ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటూ గడపాల్సి వస్తోంది. ఇంట్లో అందరూ వంటలు చేసుకుంటూ కావాల్సింది తింటున్నా కంప్లీట్ బాక్సింగ్ బాడీ కోసం ఉండడం తన అన్నకి ఇబ్బందిగానే ఉందట.

More Related Stories