English   

లాక్ డౌన్ లో పెళ్లి చేసేసుకున్న మరో నటుడు

mahesh achanta
2020-05-14 12:06:46

అదేంటో కానీ మామూలు సమయంలో కంటే ఇప్పుడే ఎక్కువగా సినిమా వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న దిల్ రాజు పెళ్లి చేసుకోగా ఈరోజు ఉదయం హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే ఇప్పుడు అదే ముహూర్తానికి మరో నటుడు కూడా పెళ్లి చేసేసుకున్నాడు. అతనే మహేష్ ఆచంట, ఈయన ఎవరా అనుకోకండి. జబర్దస్త్ మహేష్, లేదా రంగస్థలంలో చిట్టిబాబు అసిస్టెంట్‌ అనగానే గుర్తు వచ్చే ఉంటాడుగా. జబర్దస్త్ లో కిరాక్ ఆర్పీ టీమ్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమై ఆ తరువాత ఎలానో సినిమాల్లో అవకాశం దక్కించుకుని.. అతి తక్కువ సమయంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శతమానం భవతి, మహానటి, రంగస్థలం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేష్.. తన బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరూ చూసేయండి మరి. 

More Related Stories